గ్వాలియర్‌ రాజవంశీకుడు,మాజీ కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా బీజేపీతీర్ధం పుచ్చుకున్నారు. ఢిల్లీలో, బీజేపీ చీఫ్‌ జేపీ నడ్డా సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. పలువురుకు కేంద్రమంత్రులతో పాటూ బీజేపీ పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌తో విభేదాల కారణంగా జ్యోతురాదిత్య కాంగ్రెస్‌ పార్టీకి కటీఫ్ చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రహోంమంత్రి అమిత్‌ షా భేటీ అయిన సింధియా సింధియా,కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీకి ట్విట్టర్ లో రాజీనామా లేఖపంపారు. సింధియా బాజపాలో చేరడం దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయింది. బీజేపీ, సింధియాను పార్టీ తరపున రాజ్యసభకు పంపి, కేంద్రమంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చినట్టు భోగట్టా.