ఇండియన్ బ్యాంక్ ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావుకి గట్టి షాక్ ఇచ్చింది.తమ రుణం ఎగవేత వ్యవహారంలో గంటా ఆస్తుల వేలానికి రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు బ్యాంక్ అధికారులు ఓ పత్రికా ప్రకటన జారీ చేశారు. గంటాకు చెందిన ప్రత్యూష కంపెనీ, ఇండియన్ బ్యాంక్ నుంచి 141కోట్ల68 లక్షల లోన్ తీసుకుంది. అసలు, వడ్డీ కలిపి 220కోట్ల66 లక్షలకి పెరిగింది. మొత్తం రుణం ఎగవేయడంతో ఇండియన్ బ్యాంక్ ఇప్పటికే సదరు కంపెనీ ఆస్తులని స్వాధీనం చేసుకుంది. వచ్చే ఏప్రిల్ 16న బాలయ్య శాస్త్రి లేఅవుట్‌లోని గంటాకు చెందిన ప్లాట్‌ తోపాటూ ప్రత్యూష కంపెనీ డైరెక్టర్ల ఆస్తులను కూడా ఇండియన్ బ్యాంక్ ఈవేలం వేయనుంది. గంటా ఆస్తులు వేలానికి సంబంధించి నేటినుంచి 15వ తేదీ వరకు ఆన్ లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు.