పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌ రెడ్డి సోదరి రాధిక కుటుంబ సభ్యులు అలగనూరు కాలువలో శవాలుగా తేలడం సంచలనం అయింది. భర్త సత్యనారాయణ రెడ్డి, కుమార్తె సహస్రతో సహా ఎమ్మెల్యే సోదరి రాధిక అనుమానాస్పదంగా మృతి చెందారు.

దాదాపు 20 రోజుల క్రితం రాధిక కుటుంబ సభ్యులు అదృశ్యమయ్యారు. ఆదివారం సాయంత్రం బైక్‌పై వెళుతున్న ఓ జంట ప్రమాదవశాత్తు కాలువలో పడటంతో అధికారులు నీటిని నిలిపి వేశారు. నీటి స్థాయి తగ్గడంతో ఓ కారు బయటకు కనిపించింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారు నుంచి ముగ్గురిని బయటకు తీశారు. కారు నంబర్‌ ఆధారంగా పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్‌ రావు సోదరి రాధిక కుటుంబ సభ్యులుగా గుర్తించారు. జనవరి 27 న బయటకు వచ్చిన రాధిక కుటుంబం ఇప్పటి వరకు కనిపించకుండా పోయింది. ఘటనా స్థలానికి ఎమ్మెల్యే మనోహార్‌ మీడియాతో మాట్లాడుతూ.. తమ కుటుంబానికి సోదరి మరణం తీరని లోటన్నారు. కుటుంబంలో ఎలాంటి గొడవలు లేవని.. సోదరి కుటుంబం తరచుగా విహార యాత్రలకు వెళ్తూ ఉంటారని అన్నారు. గత 20 రోజులుగా వారితో సంబంధాలు లేవని అన్నారు మనోహర్.