ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో మంగళవారం నాడు మురాద్ ఆలమ్ అనే వ్యక్తి బ్యాగేజీని సిఐఎస్ఎఫ్ సిబ్బంది చెకింగ్ చేయగా వేరు శెనగ కాయల్లో డబ్బులు దాచడం అందరినీ షాక్ కు గురిచేసింది. హల్వా, బిస్కట్ ప్యాకెట్లు, వండిన మటన్ పీసులలో కూడా విదేశీ కరెన్సీని దాచడం అసలు హైలైట్ అనే చెప్పుకోవచ్చు. మొత్తం బండారం బయటపడింది. విదేశీ క‌రెన్సీని అక్ర‌మంగా త‌ర‌లిస్తున్న ఆల‌మ్‌ను క‌స్ట‌మ్స్ అధికారుల‌కు అప్ప‌గించారు. యూరో, సౌదీ, ఖతర్‌, కువైట్‌, ఒమన్‌ దేశాల కరెన్సీ ఆ వ‌స్తువుల్లో దాచాడు. మురాద్ చర్యలు అనుమానాస్పదంగా అనిపించడంతో ఎయిర్ పోర్టు అధికారులను ఇంటెలిజెన్స్ అధికారులు అలర్ట్ చేశారు. మురాద్ ను అదుపులోకి తీసుకుని లగేజ్ మొత్తాన్ని చెక్ చేయగా 45లక్షల రూపాయల విలువైన విదేశీ కరెన్సీ బయటపడింది.

Image result for igi airport


మురాద్ చేతిలో ఉన్న బ్యాగును పోలీసులు ఎక్స్-రే స్క్రీనింగ్ చేయగా.. వాటిలో పల్లీలు కాకుండా వేరే ఏవో ఉన్నట్లు తమకు అనుమానం వచ్చిందని అధికారులు అన్నారు. కొన్ని వేరు శెనగ కాయలను వలచగా అందులో నుండి దిర్హామ్, రియాల్, యూరోలు బయటపడ్డాయి. బిస్కెట్ ప్యాక్, అప్పుడే వండిన మటన్ పీసుల్లోనూ, హల్వా లోనూ విదేశీ కరెన్సీని పెట్టారు. మురాద్ టూరిస్టు వీసాతో దుబాయ్ కి వెళుతుండగా అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

Image result for igi airport