ఫిబ్రవరి 24, 25 తేదీల్లో అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ భారత్ లో పర్యటించనున్నారు. ఢిల్లీ, అహ్మదాబాద్ లలో ట్రంప్ నిర్ణయించారు. భారత పర్యటనపై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ వైట్ హౌస్ లో మీడియాతో మాట్లాడుతూ, భారత ప్రధాని నరేంద్ర మోదీ గొప్ప జంటిల్మన్ అని.. అమెరికాతో కలసి ఎంతో చేయాలని భారత్ భావిస్తోందని అన్నారు. మోదీతో తాను మాట్లాడానని, తన ఇండియా పర్యటనపై ఇరువురం చర్చించుకున్నామని ట్రంప్ తెలిపారు. అహ్మదాబాద్ లో తనకు స్వాగతం పలికేందుకు వేలాది మంది ఆతృతగా ఉన్నారని మోదీ తనతో చెప్పారని అన్నారు.

ఫిబ్రవరి 24, 25న అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఆ దేశ ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ భారత్‌లో పర్యటిస్తుండడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నామన్నారు మోదీ. మా అతిథులకు ఎప్పటికీ గుర్తుండిపోయేలా భారత్‌ స్వాగతం పలుకుతుందని ఆయన చెప్పుకొచ్చారు. వారి రాక చాలా ప్రత్యేకమైంది. భారత్, అమెరికా స్నేహ బంధం ఇలాగే చాలా కాలం పాటు సుస్థిరంగా నిలవడానికి ఈ పర్యటన దోహదపడుతుందని మోదీ ట్వీట్ చేశారు. ఇరు దేశాల మధ్య ఉన్న దృఢమైన స్నేహ‌ బంధం వ‌ల్ల భారత్‌, అమెరికా పౌరులకే కాకుండా ప్ర‌పంచ దేశాల‌కు కూడా మంచి జ‌రుగుతుందని అన్నారు.