ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 70 సీట్లకు గాను 62 స్థానాల్లో ఆప్ విజయం సాధించింది. బీజేపీ 8 నియోజవర్గాల్లో మాత్రమే గెలుపొందగా.. కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా దక్కలేదు. వరుసగా మూడో సారి కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకున్నారు. ఈ నెల 14న ఢిల్లీ సీఎం గా కేజ్రీవాల్ మరోమారు ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు తెలుస్తోంది. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ 67 స్థానాలు గెలవగా, బీజేపీ 3 స్థానాలను గెలుచుకుంది. లోక్ సభ ఎన్నికల్లో 56.58 శాతం ఓట్లు పొంది మొత్తం లోక్ సభ స్థానాలను గెలుచుకున్న బీజేపీ తాజా అసెంబ్లీ ఎన్నికల్లో 39 శాతం ఓట్లకే పరిమితమైంది. ఆమ్ ఆద్మీ పార్టీ 53.51 శాతం ఓట్లను పొందగా.. కాంగ్రెస్ పార్టీ 4.36 శాతం ఓట్లను మాత్రమే పొందింది.