దుబాయ్‌: ఆస్ట్రేలియా ఆటగాడు మార్నస్‌ లబుషేన్‌ రికార్డులు సృష్టిస్తున్నాడు. మైదానంలో అతడి పరుగుల వరదకు ర్యాంకులు దిగొస్తున్నాయి. గతేడాది జనవరి 8న 105వ ర్యాంకులో ఉన్న అతడు ఈ ఏడాది జనవరి 8న ఏకంగా 3వ స్థానంలో నిలిచాడు సంచలనం రేపాడు. చివరి ఐదు టెస్టుల్లో అతడి పరుగులు 896 కావడం గమనార్హం. తాజా ఐసీసీ టెస్టు బ్యాట్స్‌మెన్‌ ర్యాంకింగ్స్‌ జాబితాలో ఒక స్థానం మెరుగై కెరీర్‌ అత్యుత్తమ 3వ ర్యాంకు అందుకున్నాడు. అజింక్య రహానె, ఛెతేశ్వర్‌ పుజారా అతడికి దారివ్వక తప్పలేదు.