ముంబయి: టీ20 ప్రపంచకప్‌నకు కొన్ని నెలల సమయమే ఉంది. వన్డే ప్రపంచకప్‌ను ముద్దాడలేక పోయిన టీమిండియా ఇందులో ఎలాగైనా విజయం సాధించాలని అభిమానులు ఆశిస్తున్నారు. సారథి విరాట్‌ కోహ్లీ, కోచ్‌ రవిశాస్త్రి సైతం జట్టు కూర్పుపై ప్రయోగాలు చేస్తున్నారు. యువకులకు నిలకడగా అవకాశాలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇండోర్‌లో శ్రీలంకతో మ్యాచ్‌ జరుగుతున్నప్పుడు మాజీ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ టీ20 ప్రపంచకప్‌నకు తన జట్టును ఎంపిక చేశాడు. ఇందులో ఎంఎస్‌ ధోనీ, శిఖర్‌ ధావన్‌కు చోటివ్వకపోవడం గమనార్హం. లక్ష్మణ్ ప్రస్తుతం క్రికెట్‌ విశ్లేషకుడు, వ్యాఖ్యాతగా అదరగొడుతున్న సంగతి తెలిసిందే.