సాగరనగరం విశాఖని కొవిడ్-19 వెంటాడుతోంది.ఇప్పటికే మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో అధికారయంత్రాంగం అప్రమత్తమైంది.విశాఖ జిల్లా వ్యాప్తంగా 1 వేయి470 మందిని హోం క్వారంటైన్‌చేసారు. అనకాపల్లి, గాజువాక, సీతమ్మధార ప్రాంతాలను హైరిస్క్ జోన్లుగా గుర్తించి ఆ ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. కరోనా వైరస్ అంతకంతకీ శృతిమించుతుండడంతో… దాని నియంత్రణకి ప్రజలంతా ఏకతాటిపైకి రావాలంటూ ప్రజాప్రతినిధులు పిలుపునిస్తున్నారు. అందరూ ఇంటికే పరిమితమవ్వాలని,సామాజిక దూరాన్ని పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.కరోనా కట్టడికి 20 ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసారు. ప్రస్తుతం రెండవడ్దశలో వున్న కరోనా వైరస్ మూడో దశకు చేరకముందే కట్తడి చేయాలన్న సంకల్పంతో అధికార్లు సామదానభేద దండోపాయాలు ప్రయోగిస్తున్నారు. విదేశాల నుంచి వచ్చిన వారి వివరాలని తమకి అందచేయాలని కోరుతున్నారు.కావాలని ఆ విషయాలు దాచిపెడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.