ఇకమీదట మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా లో కూడా హల్చల్ చేయనున్నారు.శ్రీశార్వరినామ సంవత్సరంలో చిరు సోషల్ మీడియాలో అకౌంట్స్‌ ప్రారంభిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌, ట్విట్టర్ ఖాతా నుంచి ఈ విషయాన్ని మెగాస్టార్ అభిమానులకు ట్వీట్ చేసారు. తన భావాలను, సందేశాలను,ఇతరవిశేషాలని ఇక మీదట ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లో అభిమానులతో పంచుకోవాలని ఈ నిర్ణయం తీసుకున్నట్టు చిరంజీవి ఆ ట్వీట్ లో తెలిపారు. మెగాస్టార్ అభిమానుకి ఈవార్త కొత్తసంవత్సరంలో ఉగాది పచ్చడంత తియ్యటి కబురే.