కరోనా విస్థరిస్తున్న నేపథ్యంలో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చాలామంది సెలబ్రిటీస్ తమదైన స్టైల్లో స్పందిస్తున్నారు. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ తీసుకొచ్చిన సేఫ్‌ హ్యాండ్స్‌ చాలెంజ్‌ రంజుగా మారింది. దీనిలో భాగంగా పలువురు సెలబ్రిటీస్ చేతులు శుభ్రపరుచుకుంటున్న వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు. అంతా దీన్ని పాటించాలని చాలెంజ్ విసురుతున్నారు. అమెరికా కాన్సుల్‌ జనరల్‌ క్యాథరిన్‌ హడ్డా హైదరాబాద్‌లో విసిరిన సేఫ్‌ హ్యాండ్స్‌ చాలెంజ్‌ను బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు స్వీకరించింది. ప్రతి ఒక్కరూ తమ చేతులను శుభ్రపరుచుకోవాలని పిలుపునిచ్చింది. కేంద్ర క్రీడాశాఖమంత్రి కిరణ్‌ రిజిజు, టీమిండియా క్రికెట్ కాప్టెన్ విరాట్‌ కోహ్లి, ఇండియన్ టెన్నిస్‌ స్టార్ సానియా మీర్జాలకి సేఫ్‌ హ్యాండ్స్‌ చాలెంజ్‌ను విసిరారు.