నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి టీఆర్‌ఎస్‌ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవితని ఆ పార్టీ ప్రకటించింది. ఈ స్థానం కోసం కాంగ్రెస్‌, బీజేపీ బరిలో నిలిచినప్పటికీ… కవిత ఎన్నిక లాంఛనమేనని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఏప్రిల్‌ 7న పోలింగ్ నిర్వహించి‌ 9న ఓట్ల లెక్కింపు చేపడతారు. నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా 2015లో టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి గెలిచి, కాంగ్రెస్‌ పార్టీలో చేరిన భూపతిరెడ్డిపై అనర్హత వేటు పదడంతో… ఈ స్థానం ఖాళీయింది. ఇక్కడనుంచి గెలిస్తే కవిత తెలంగాణలో తొలి మహిళా ఎమ్మెల్సీగా రికార్డు నెలకొల్పుతారు. 4 జనవరి 2022వరకూ ఆమె పదవిలో కొనసాగుతారు. నిజామాబాద్ లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి తరవాత కవితని రాజ్యసభకి పంపుతారన్న ఊహాగానాలు మొదలయ్యాయి.అది జరగకపోవడంతో కవిత పొలిటికల్ గా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నారు. తాజ పరిణామంతో ఓడిన నిజామాబాద్ గడ్డమీది నుంచే ఎమ్మెల్సీగా గెలిచే ఆమెను కేబినెట్‌లోకి తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోందని టీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి.