లక్కొచ్చి నడ్డిమీద తన్నేస్తుంటే దేవుడుకూడా ఏం చేయలేడట. క్యూట్ హీరోయిన్ కాజోల్ అగర్వాల్ విషయంలో అదే జరిగింది. మెగాస్టార్ చిరంజీవి 152 వ సినిమాలో అనుకోకుండా చాన్స్ కొట్టేసింది.కొరటాల శివ డైరెక్షన్ లో వస్తున్న ‘ ఆచార్య ‘మెగాస్టార్ హీరో అన్నది జగమెరిగిన సత్యం. ఈ సినిమాలో హీరోయిన్ గా మొదట త్రిషను అనుకున్నారు. కానీ క్రియేటివ్ డిఫరెన్సుల కారణంగా సినిమా నుంచి తప్పుకుంటున్నాను అని త్రిష ట్విట్తర్ ద్వార ప్రకటించింది. దీంతో త్రిష బదులు కాజల్ అయితే ఎలా వుంటుందని చిత్ర బృందం గుణకారాలు,భాగహారాలూ చేస్తోంది. చిరంజీవి ఖైదీ నంబర్ 150లో ఆయన సరసన కాజల్ హీరోయిన్ గా మెరిసింది. కాజల్ కు టాలీవుడ్ లో ఈమధ్య చేతిలో సినిమాల్లేవు. సురేష్ బాబు తీస్తున్న కొరియన్ రీమేక్ లో ఆమె అల్లరి నరేష్ తో నటించడానికి ఒప్పుకొంది. ఈ రాంగ్ టైంలో చిరంజీవీఆచార్య’ లో హీరోయిన్ ఆఫర్ దక్కడం అంటే అలాటిలాంటి లక్కుకాదు అన్నది టాలీవుడ్ టాక్.