కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి కరోనాతో హైదరాబాద్‌ ఆస్పత్రిలో చనిపోవడం తెలంగాణాలో కలకలం రేపింది. దీంతో ప్రభుత్వం అలర్ట్‌ అ‍య్యింది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులని విమానాశ్రయాల వద్దే ఆపి వరస పరీక్షలు నిర్వహిస్తోంది. రోజు రోజుకీ కరోనా విజృంభిస్తుండడంతో ప్రభుత్వం అలర్ట్ అయింది. కరోనా గురించి ముఖ్యమంత్రి కే.సీ.ఆర్‌ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి పరిస్థితులపై సమీక్షించారు. ముందు జాగ్రత్తగా పాఠశాలతో పాటు, సినిమా హాల్స్‌, మాల్స్‌ను మూసివేయాలని కె.సి.ఆర్ ఆదేశించారు. పదో తరగతి, ఇంటర్‌ పరీక్షలను మాత్రం షెడ్యూల్‌ ప్రకారమే నిర్వహిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 31 వరకు అన్ని విద్యాసంస్థలకు సెలవులు మంజూరు చేసేసారు. తెలంగాణలో ఇప్పటికే రెండు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గాంధీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య కేంద్రాల్లో వారికి చికిత్స అందిస్తున్నారు. వైరస్‌ లక్షణాలు కనిపించిన వారికి పరీక్షలు నిర్వహిస్తూ ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది.