కరోనా పంజా ఇప్పుదు ఇండియా పై పడింది. రోజురోజుకి కేసులు పెరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లోనూ కరోనా కల్లోలం మొదలై… నెల్లూరులో ఒక అనుమానితుడు ఆస్పత్రిలో చేరాడు. విశాఖపై కూడా కరోనా పడగ విప్పింది. కరోనా వైరస్ సోకిందనే అనుమానంతో నలుగురు ఆస్పత్రిలో చేరారని సమాచారం. దీంతో విశాఖవాసుల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. కరోనా వైరస్ భయంతో విశాఖపట్టణం నుంచి పలు విమాన సర్వీసులు క్యాన్సిల్ అవుతున్నాయి. విశాఖ- కౌలాలంపూర్, విశాఖ-సింగపూర్ ల మధ్య విమాన సర్వీసులు రద్దు అయ్యాయి.