అంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీకి మరో ఎదురుదెబ్బతగిలింది. ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్దమయ్యారు. బలరాంతో పాటు ఆయన కుమారుడు వెంకటేశ్ కూడా వైసీపీ తీర్థంపుచ్చుకోనున్నారు. రాష్ట్రమంతటా వైసీపీ అనుకూల పవనాలు వీచినా చీరాలలో తెలుగుదేశంపార్టీ తరపున పోటీ చేసిన బలరాంని 20 వేల ఓట్ల మెజార్టీతో గెలిపించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎం జగన్ దగ్గరకు వెళ్తున్నట్లు బలరాం చెప్పారు. రెండు రోజులుగా నియోజకవర్గంలోని తన సన్నిహితులు, మద్దతుదారులతో సమాలోచనల తర్వాత బలరాం వైసీపీ లో చేరాలని నిర్ణయం తీసుకున్నారు.