బంగారం కొనాలనుకునేవారికి శుభవార్త . అంతర్జాతీయ మార్కెట్‌లో ధర పెరిగినప్పటికీ దేశీ మార్కెట్‌లో జువెలర్లు, కొనుగోలుదారుల నుంచి డిమాండ్ తగ్గడంతో ప్రతికూల ప్రభావం పడి బంగారం ధర భారీగా తగ్గింది. బంగారం ధర పెరిగినా వెండి ధర మాత్రం వెలవెలబోలేదు. హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు, 280 రూపాయల తగ్గుదలతో 45వేల 7వందలకు క్షీణించింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 320 రూపాయల తగ్గుదలతో 41వేల 840 రూపాయలకు పడిపోయింది. కేజీ వెండి ధర 48వెల 5వందలు పలుకుతోంది. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ లో మార్పు, బ్యాంకుల్లో ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి అంశాలు బంగారం ధరపై ప్రభావం చూపుతుంటాయి.