అల్లు అర్జున్, సుకుమార్ క్రేజీ కాంబినేషన్ లో మరో సినిమా రాబోతుంది.ఇదిగో అదిగో అంటున్న ఈ మూవీకి ఈ నెల్లోనే క్లాప్ కొదతారట.రణస్థలం తర్వాత ఆ స్థాయి హిట్ కోసం ఎదురుచూస్తున్న సుకుమార్,అలవైకుంఠపురం లాంటి బ్లాక్ బస్టర్ కోసం కాచుక్కూర్చున్న బన్నీ ఈ సినిమా మీద స్పెషల్ ఇంట్రస్ట్ చూపిస్తున్నారు.నిజానికి ఫిబ్ర‌వ‌రిలోనే ఈ సినిమా ప‌ట్టాలెక్కాలట. బ‌న్నీ రిలాక్స్,వెయిట్ అండ్ సీ అంటూండడంతో లేట్ అయింది. ఇప్పుడు బ‌న్నీ రెడీచ్ అనడంతో సుకుమార్ సినిమా మొద‌లెట్టడానికి ఊ కొట్టాడు. ముహూర్తం కూడా ఫిక్స‌యిపోయింది. ఈనెల 15 నుంచి బ‌న్నీ – సుకుమార్ ల సినిమా న‌ల్ల‌మ‌ల్ల అడ‌వుల్లో ప్రారంభం కానుంది.ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో న‌డిచే క‌థట ఇది. అందుకని అల్లు అర్జున్ చిత్తూరు స్లాంగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడట. బన్నీ గెట‌ప్ కూడా వైవిధ్యంగా ఉంటుందట. కాస్ట్యూమ్స్ పై కూడా బ‌న్నీ ప్రత్యేక శ్ర‌ద్ధ పెట్టాడు. అందుకోసం ముంబై నుంచి ప్ర‌త్యేకంగా ఓ బృందం వ‌చ్చి ప‌ని చేస్తోంది.