దేశంలోనే అతిపెద్ద బ్యాంక్‌- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కస్టమర్లకు తీపికబురు చెప్పింది. మంత్లీ మినిమమ్ బ్యాలెన్స్ చార్జీలను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకొంది. ఇది కోట్లాదిమంది సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ కస్టమర్లకు ప్రయోజనం కలిగించే అంశంగా బ్యాంకింగ్ రంగ నిపుణులు అభివర్ణిస్తున్నారు. ప్రస్తుతం sbi సేవింగ్స్ బ్యాంక్ కస్టమర్లు వేయి రూపాయలనుంచి 3 వేల వరకూ మినిమమ్ బ్యాలెన్స్ కలిగి ఉండాలన్న నిబంధన ఉంది.మెట్రో నగరాల్లో 3వేలు, పట్టణాల్లో 2 వేలు, పల్లెల్లో ఒకవేయి సేవింగ్స్ అకౌంట్లకు మంత్లీ మినిమమ్ బ్యాలెన్స్ ఉండాలని sbi నిర్దేశించింది. అలా లేని పక్షంలో 5 రూపాయలనుంచి 15రూపాయలవరకూ వరకు పెనాల్టీ వసూలు చేస్తోంది. దీనికి మళ్ళీ జీఎస్‌టీ అదనం అవడంతో ఖాతా దారులు ఇబ్బందులు పడుతున్నారు. మినిమమ్ బ్యాలెన్స్ చార్జీలతో పాటూ ఎస్ఎంఎస్ చార్జీలను కూడా sbi తొలగిస్తోంది. 31 లక్షల కోట్లరూపాయల మేర డిపాజిట్లు కలిగివున్న sbi సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్‌పై వడ్డీ రేటును 3 శాతానికి సవరించడంకూడా కస్టమర్లకి శుభవార్తే అని చెప్పాలి.