మహిళల టీ20 వరల్డ్ కప్ మొదలైంది. మొదటి మ్యాచ్ లో భారత జట్టు-ఆస్ట్రేలియాను ఢీకొట్టనుంది. నాలుగు సార్లు ఛాంపియన్ అయిన ఆస్ట్రేలియాను భారత్ ఎలా ఎదుర్కొంటుందా అని క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది. బలమైన ఆస్ట్రేలియా జట్టును హర్మన్ ప్రీత్ సేన ఓడించడం అంత సులువైన విషయమేమీ కాదు.. కానీ ఇటీవల భారత జట్టు ఆస్ట్రేలియాను చాలా మ్యాచ్ లలో నిలువరించడం విశేషం.

మహిళల విభాగంలో ఇప్పటి వరకూ ఆరు టీ20 వరల్డ్ కప్ లు జరగగా అందులో నాలుగు సార్లు ఆస్ట్రేలియానే టైటిల్ ను ఎగరేసుకుపోయింది. దీన్ని బట్టే ఆస్ట్రేలియా జట్టు ఎంత బలమైనదో ఊహించవచ్చు. బెత్ మూనీ, అలెక్స్ పెర్రీ, మెగ్ లానింగ్, గార్డనర్, అలిస్సా హీలీ లను భారత జట్టు ఎలా ఎదుర్కుంటుందో చూడాలి. భారత జట్టులో స్టార్స్ అయిన షఫాలీ వర్మ, స్మ్రితి మందన, హర్మన్ ప్రీత్ కౌర్ లు రాణించడం కూడా చాలా ముఖ్యం.

ఈ మ్యాచ్ లో తలపడనున్న ఇరు జట్ల వివరాలు
India Women (Playing XI): Shafali Verma, Smriti Mandhana, Jemimah Rodrigues, Harmanpreet Kaur(c), Deepti Sharma, Veda Krishnamurthy, Shikha Pandey, Taniya Bhatia(w), Arundhati Reddy, Poonam Yadav, Rajeshwari Gayakwad

Australia Women (Playing XI): Alyssa Healy(w), Beth Mooney, Ashleigh Gardner, Meg Lanning(c), Ellyse Perry, Rachael Haynes, Annabel Sutherland, Jess Jonassen, Delissa Kimmince, Molly Strano, Megan Schutt