పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వ్యతిరేకంగా బెంగళూరులో ‘సేవ్ కాన్‌స్టిట్యూషన్’ కార్యక్రమం నిర్వహించారు. మజ్లిస్ నేత అసదుద్దీన్ ఒవైసీ ఈ సభకు ముఖ్య అతిధిగా వెళ్లారు. అసదుద్దీన్ ఒవైసీ ప్రసంగించిన తర్వాత వేదిక ఎక్కి మైక్ వద్దకు వచ్చిన అమూల్య అనే యువతి ‘పాకిస్థాన్ జిందాబాద్’ అంటూ నినాదాలు చేసింది. వెంటనే అప్రమత్తమైన ఒవైసీ ఆమె వద్దకు వచ్చి మైక్ లాక్కుకుని పక్కకు తీసుకెళ్లారు.

Image result for amulya

అమూల్య పై దేశద్రోహం కేసు నమోదైంది. ఆమె బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా న్యాయమూర్తి నిరాకరించారు. 14 రోజుల పాటు ఆమెను జ్యుడీషియల్‌ కస్టడీకి తీసుకోవాలని ఆదేశించారు. అమూల్యకు బెయిలు ఇవ్వద్దని కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప అన్నారు.

Image result for amulya

అమూల్య వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు అసదుద్దీన్ ఒవైసీ చెబుతున్నారు. ఆమెకు ఈ కార్యక్రమానికి సంబంధం లేదని, కార్యక్రమ నిర్వాహకులు ఆమెను ఆహ్వానించలేదని వివరణ ఇచ్చారు. తాము ఎప్పటికీ పాకిస్థాన్‌కు మద్దతు ఇవ్వబోమని, భారత్‌తోనే ఉంటామని ఒవైసీ స్పష్టం చేశారు.