పారాసైట్ అనే కొరియన్ సినిమాకు 92వ అకాడెమీ అవార్డ్స్ లో నాలుగు అవార్డులను ఎగరేసుకుపోయింది. అయితే తమిళ సినీ ప్రేమికులు ఇది ‘మిన్సార కన్నా’ సినిమాకు దగ్గరగా ఉందని సరికొత్త వాదనను వినిపించారు. ఇళయదళపతి విజయ్ హీరోగా నటించిన ఈ సినిమాకు కె.ఎస్.రవి కుమార్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా 1999 లో విడుదలైంది.

మిన్సార కన్నా సినిమాకు ప్రొడ్యూసర్ పి.ఎల్.తేనప్పన్ మాట్లాడుతూ పారాసైట్ ను తెరకెక్కించిన ‘బాంగ్ జూన్ హో’ ను వదిలిపెట్టేదే లేదని చెబుతున్నారు. ఆ చిత్ర దర్శకనిర్మాతలను కోర్టుకు లాగుతానని చెబుతున్నారు. త్వరలో ఇంటర్నేషనల్ లాయర్ తో సంప్రదింపులు జరుపుతామని చెప్పారు. పారాసైట్ సినిమా మెయిన్ ప్లాట్ తమ సినిమా నుండి దొంగిలించారని ఆరోపించారు పి.ఎల్.తేనప్పన్. ఈ విషయంపై కె.ఎస్.రవి కుమార్ ను సంప్రదించగా.. తాను పారాసైట్ సినిమాను ఇంకా చూడలేదని.. చూసాక మాట్లాడుతానని అన్నారు. అంటే 20 ఏళ్ల కిందటే నాలుగు ఆస్కార్ అవార్డులు సాధించిన సినిమా కథ కోలీవుడ్ లో వచ్చిందన్నమాట.