ప్రస్తుతం భారత్-పాకిస్తాన్ మధ్య క్రీడల్లో కూడా ఎటువంటి పోటీలు జరగడం లేదు. అంతర్జాతీయంగా ఏదైనా టోర్నమెంట్ లో ఇరు జట్లు తలపడాలి తప్పితే భారత జట్లను పాకిస్తాన్ కు పంపిన దాఖలాలే లేవు. కానీ పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాత్రం సరికొత్త విషయం చెబుతున్నారు. అదేమిటంటే పాక్ లో కబడ్డీ వరల్డ్ కప్ జరిగిందట.. అందులో భారత్ పాక్ చేతిలో ఓడిపోయిందట..! కబడ్డి ప్రపంచకప్‌ ఫైనల్లో భారత్‌ను ఓడించి, కప్పు గెలిచిన పాకిస్తాన్ జట్టుకు శుభాకాంక్షలు” అంటూ ఆయన ఓ ట్వీట్ చేశారు.. కానీ భారత జట్టు అసలు వెళ్లలేదని తెలుస్తోంది. కానీ ఆయన మాత్రం ఏమేమో చెబుతున్నారు. ప్రస్తుతం భారత్ లో కబడ్డీకి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.. అలాంటిది ప్రపంచకప్ ఫైనల్ కు వెళ్లినా మనకు తెలీకుండా ఉంటుందా చెప్పండి.

Image result for imran khan tweet

భారత్ నుంచి అధికారికంగా ఏ జట్టూ వెళ్లకపోయినా, ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ఇండియాపై 43-41 తేడాతో పాక్ గెలిచిందని అక్కడి పత్రికలు రాశాయి. దీంతో పాక్ ప్రధాని ఇమ్రాన్ శుభాకాంక్షలు కూడా తెలిపారు. పాక్ లో నిర్వహిస్తున్న సర్కిల్ కబడ్డీ వరల్డ్ కప్ కు తాము ఎటువంటి జట్టునూ పంపలేదని ఏకేఎఫ్‌ఐ (అమెచ్యూర్ కబడ్డి ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) స్పష్టం చేసింది. ఈ మేరకు పాక్ బోర్డుకు ముందే లేఖ రాసి, అదే విషయాన్ని ఐఓఏ (ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్)కు కూడా తెలిపింది. దీంతో ట్విట్టర్ లో భారతీయులు పాక్ ప్రధానిని ఓ ఆట ఆడుకుంటూ ఉన్నారు. భారత్ జట్టునే పంపించకుండా.. పాక్ జట్టు విజయం ఎలా సాధించిందబ్బా అని అడుగుతున్నారు. ఇమ్రాన్ ఏ బ్రాండ్ మందు తాగారో కనుక్కోండి అంటూ సెటైర్లు వేస్తున్నారు.

Image result for pakistan kabaddi circle