వరల్డ్ లాంగ్వేజ్ డేటాబేస్ ఎథ్నోలాగ్ వెలువరించిన తాజా నివేదికలో ప్రపంచంలో ఎక్కువమంది మాట్లాడే భాషల్లో మూడో స్థానంలో ‘హిందీ’ నిలిచింది.. ప్రపంచవ్యాప్తంగా హిందీ భాషను 615 మిలియన్ల మంది మాట్లాడుతున్నారని ఈ నివేదిక తెలిపింది. ఇంగ్లీషు మొదటి స్థానంలో ఉండగా.. చైనా భాష మాండరిన్ రెండో స్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఆంగ్లం మాట్లాడేవారి సంఖ్య 1,132 మిలియన్ల మంది కాగా, మాండరిన్ ను 1,117 మిలియన్ల మంది మాట్లాడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా మనుగడలో ఉన్న 7,111 భాషలను పరిగణనలోకి తీసుకుని తాజా నివేదికను వెల్లడించారు.