టాలీవుడ్ ప్రముఖ నటుడు శ్రీకాంత్‌ తండ్రి మేక పరమేశ్వరరావు (70) గత రాత్రి కన్నుమూశారు. ఆయన గత నాలుగు నెలలుగా హైదరాబాద్ లోని స్టార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఊపిరితిత్తుల వ్యాధితో దీర్ఘకాలంగా బాధపడుతున్న ఆయన ఆరోగ్యం ఆదివారం రాత్రి మరింత విషమించడంతో తుది శ్వాస విడిచారు.

Image

విషయం తెలుసుకున్న చిరంజీవి తన సన్నిహితుడైన శ్రీకాంత్ నివాసానికి వెళ్లారు. మేకా పరమేశ్వరరావు భౌతికకాయానికి నివాళులు అర్పించారు. చిరంజీవిని చూడగానే శ్రీకాంత్ భావోద్వేగాలకు లోనై ఆయనను హత్తుకున్నారు. విషాదంలో ఉన్న శ్రీకాంత్ ను ఓదార్చారు. ఆ సమయంలో మరో హీరో గోపీచంద్ కూడా అక్కడే ఉన్నారు. శ్రీకాంత్ తండ్రి అంత్యక్రియలను సోమవారం నాడు హైదరాబాద్ ఫిలింనగర్ మహాప్రస్థానం శ్మశాన వాటికలో నిర్వహించనున్నారు.

Image

పరమేశ్వరరావుది కృష్ణా జిల్లాలోని మేకావారిపాలెం. పరమేశ్వరరావు-ఝాన్సీలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు శ్రీకాంత్, అనిల్.. వారికి ఓ అమ్మాయి నిర్మల ఉన్నారు.

Image