షూలో పాములు దాక్కోవడం చూశాం.. కార్ లోనూ.. బైక్ లోనూ.. పాములు తలదాచుకున్న వీడియోలు మనం చూసే ఉన్నాం. అలాంటిది హెల్మెట్ లో పాము ఉంది.. ఆ పాము ఉన్నదని తెలియకుండానే కొన్ని కిలోమీటర్లు అతడు అలా ప్రయాణించాడు.. ఆ తర్వాత హెల్మెట్ లో ఏదో కదులుతోంది గమనించాడు. తీసి చూడగా షాక్ అయ్యాడు.. ఓ పాము పిల్ల అతడి హెల్మెట్ లో ఉంది.

Image result for snake in helmet

కేరళలోని కందానాద్ లోని సెయింట్ మేరీ పాఠశాలలో సంస్కృత ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న రంజిత్ కు ఈ ఘటన ఎదురైంది. స్కూలు ముగిసిన తర్వాత బైక్ మీద వెళుతుండగా, హెల్మెట్లో ఏదో ఉన్నట్టు అనిపించిందని.. బైక్ ఆపి హెల్మెట్ ను పరిశీలించగా, అందులో ఓ పాము పిల్ల కనిపించింది. ఆ పాము అప్పటికే చనిపోయి ఉందట. రంజిత్ ఈ విషయాన్ని స్నేహితులకు తెలియజేయగా వాళ్ళు పాము కాటేసి ఉండొచ్చన్న అనుమానంతో రంజిత్ ను వైద్యపరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యపరీక్షల్లో పాము కాటువేయలేదని తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు. తమ ఇంటికి సమీపంలో ఓ చెరువు ఉందని, ఆ పరిసరాల నుంచి వచ్చిన పాము హెల్మెట్లో దూరి ఉంటుందని రంజిత్ భావిస్తున్నాడు. లేదా చచ్చినపామును ఎవరైనా హెల్మెట్లో పెట్టారా అన్నది కూడా డౌట్ కూడా ఉంది. ఏది ఏమైనా పక్కన పెట్టిన వస్తువులను తిరిగి వాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది.

Image result for snake in helmet