జమ్మూకశ్మీర్ లోని సరిహద్దుల వెంబడి పాకిస్తాన్ కాల్పులకు దిగింది. శుక్రవారం ఉదయం ఫూంచ్ జిల్లాలోని షాపూర్, కెర్ని సెక్టార్ల పరిధిలో పాక్ సైనికులు కాల్పులకు తెగబడ్డంతో భారత పౌరుడు మరణించాడు.. ఈ విషయాన్ని భారత సైన్యం ధృవీకరించింది. పాకిస్తాన్ కాల్పులకు భారత సైన్యం ధీటుగా జవాబు చెప్పింది. పూంఛ్ జిల్లాలోని కునైయన్ ప్రాంతంలో పోలీసులు, ఆర్మీ కలిసి చేపట్టిన కార్డన్ సెర్చ్ లో టెర్రరిస్టుల డంప్ బయటపడింది. ఒక ఏకే 47 గన్, ఒక చైనా పిస్టల్, బుల్లెట్లు, కొన్ని పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. పాకిస్తాన్ ఎన్ని సార్లు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నా.. భారత్ ఓపిక పడుతూనే ఉంది. జమ్మూలో తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తూనే ఉంది.