అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. భారత్ లో పర్యటించనున్నారు అయితే దీనిపై అనేక రకాల ఆసక్తికర చర్చలు మాత్రం జరుగుతున్నాయి..అంతేకాదు ట్రంప్ కూడా ఇండియాలో పర్యటించడానికి ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారని ఆయనే తెలిపారు..మరి ఈ ఆకస్మిక పర్యటన ఎందుకు చేస్తున్నట్లు..? ఇంత హడావిడిగా భారత్ లో ట్రంప్ టూర్ కు కారణం ఏంటి..?
భారత్ అమెరికా మధ్య సత్సంబంధాలు అంతర్జాతీయంగా పలు ఆర్ధిక కార్యకలాపాలపై దృష్టి పెట్టడానికి ఉపయోగపడుతోంది.. అయితే అమెరికా ఆర్ధిక వ్యవస్థపై ప్రవాస భారతీయుల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందన్న విషయం తెలిసిందే..ఇక అమెరికా సంయుక్త రాష్ట్రాల అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికైన నాటి నుండి భారత్ తో మంచి సంబంధాలను కొనసాగిస్తున్నారు.. అమెరికా భారత్ ల మధ్య కొనసాగుతున్న వాణిజ్య, దౌత్య , ద్వైపాక్షిక సంబంధాలతో ప్రపంచ వ్యాప్తంగా ఎంతగానో ఈ రెండు దేశాలు ఎంతగానో పరిపుష్టి సాధిస్తున్నాయి..అయితే అమెరికాతో ఈ సత్సంబంధాలు మోదీ సర్కార్ వచ్చినప్పటి నుండి ఇంకా బలపడ్డాయి అనడానికి ఎటువంటి సందేహం అవసరం లేదు.. మోదీ ,ట్రంప్ ల మధ్య మంచి స్నేహం కుదరడంతో ఆ స్నేహం ఇరు దేశాల ఆర్ధిక ప్రగతికి బాగా తోడ్పడుతోంది.. తాజాగా పిబ్రవరి నెలలో ట్రంప్ భారత్ లో పర్యటించనున్నారు..ఈ విషయం పై వైట్ హౌస్ కూడా అధికారికంగా ప్రకటన చేసింది..అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ ఈ నెల 24,25 తేదీలలో భారత్ లో పర్యటించనున్నట్లు శ్వేతసౌధం అధికారిక ప్రకటన విడుదల చేయడంతో , ట్రంప్ భారత్ లో పర్యటించడానికి కారణాలు ఏంటి అనే విషయం పై పలు ఆసక్తికర చర్చలు మొదలయ్యాయి..
ఇక ఈ పర్యటనలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో పాటు ఆయన సతీమణి కూడా ఉంటారని తెలిపారు.. అయితే గత వారం ట్రంప్ మోదీల మధ్య జరిగిన చరవాణి సంభాషణల వల్ల ఈ పర్యటన ఖరారైనట్లు తెలిపారు..అంతేకాదు ఈ పర్యటనలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది..ఇప్పటికే ఇండియా, అమెరికాల మధ్య మంచి సంబంధాలు కొనసాగుతున్నాయని ట్రంప్ టూర్ తో ఆ సంబంధాలు ఇంకా బలపడుతాయని చర్చించుకుంటున్నారు.. ఈ పర్యటనలో ఇద్దరు నేతలు ద్వైపాక్షిక సంబంధాల ప్రగతిని సమీక్షించడంతో పాటు , వ్యూహాత్మక భాగస్వామ్యం విస్తృతం చేసేందుకు కృషి చేస్తామని భారత్ తెలిపింది..ఇక భారత్ లో పర్యటించడానికి ట్రంప్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని ఆయన తెలిపారు.. అంతేకాకుండా భారత్ చాలా గొప్పదేశం అక్కడ పర్యటన చేయాలంటే నాకు ఎప్పుడు ఆసక్తిగానే ఉంటుందని ఆయన తెలిపారు..

ఇక వైట్ హౌస్ లోని మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ట్రంప్.. నరేంద్రమోదీ మంచి జెంటిల్ మెన్ అని కితాబిచ్చారు.. తనకు మోదీకి మధ్య మంచి స్నేహం ఉందని ఆయన తెలిపారు..అంతేకాదు మోదీ ఒక గొప్ప ప్రధాని అని పొగడ్తలతో ముంచెత్తారు..అయితే ఇప్పటికే మోదీ భారత ప్రధాని హోదాలో అమెరికాలో నాలుగు సార్లు పర్యటించారు.. దీంతో అమెరికా , భారత్ ల మధ్య గొప్ప స్నేహ సంబంధాలు ఉన్నాయని తెలిపారు.. ఇండియా, అమెరికా ల మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడానికి ఈ పర్యటన ఎంతగానో ఉపయోగపడుతుందని వైట్ హౌస్ తెలిపింది.. ఉభయ దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలలో భాగంగా ట్రంప్ చేయనున్న పర్యటన ఎంతగానో ఉపయోగపడుతుందని ఆర్ధిక విశ్లేషకులు అంటున్నారు..ఇక ట్రంప్ అహ్మదాబాద్ , ఢిల్లీలలో పర్యటించనున్నట్లు దాదాపు ఖరారైంది..

భారత్ లో పర్యటించనున్న ట్రంప్ వ్యాపార, వాణిజ్య, దౌత్య మొదలగు ద్వైపాక్షిక సంబంధాలను కొనసాగిస్తు మరికొన్ని వాణిజ్య పరమైన నిర్ణయాలు తీసుకునేందుకు అవకాశం ఉందని అంచనా.. అంతేకాకుండా ట్రంప్ భారత్ లో పర్యటించిన తరువాత పెట్టుబడులను కూడా ఆకర్షించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.. గతంలో ఏ భారత ప్రధాని చేయని ఆర్ధిక సంస్కరణలు మోదీ చేస్తున్నారని ట్రంప్ అనడం సర్వత్రా ఆసక్తిని రేపుతోంది..

ఇక ఇప్పటి వరకు అమెరికాలో పర్యటించిన మోదీకి ఘన స్వాగతం పలికిన ట్రంప్ అండ్ టీమ్ కు.. మోదీ సర్కార్ సైతం జీవితాంతం గుర్తుండిపోయేలా స్వాగతం పలకడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.. గతంలో హౌదీ-మోదీ వంటి సభలో మోదీకి విశేషమైప స్పందన లభించింది..మరోవైపు ట్రంప్ భారతదేశంలో పర్యటించనున్న మొదటి పర్యటన కావడంతో ఆయనకు గుర్తుండిపోయేలా మోదీ సర్కార్ ఏర్పాట్లు చేయనున్నారు..

గతంలో అమెరికా లో పర్యటించిన భారత్ ప్రధాని నరేంద్ర మోదీకి అక్కడ ఉన్న ప్రవాస భారతీయులు , ఇండో అమెరికన్లు, అమెరికా పౌరులు ఘన స్వాగతం పలికారు..అంతేకాకుండా మోదీ ట్రంప్ లు మంచి స్నేహితులని అందరు భావిస్తున్నారు.. ఇక మోదీ ట్రంప్ కూడా ప్రతి అంతర్జాతీయ సదస్సుల్లో కలిసి ఆసక్తిగా నిలిచారు..ప్రతీ సదస్సులో మోదీ ట్రంప్ ల స్నేహం గురించి చర్చించుకోని దేశం లేదంటే అతిశయోక్తి కాదు..

అమెరికాలో మోదీ నిర్వహించిన ప్రచార సభలో ఇండో అమెరికన్లు భారీ సంఖ్యలో పాల్గొని ఘన విజయం చేశారు.. హౌదీ- మోదీ అనే పేరుతో నిర్వహించిన ఈ సభలో మోదీ మాట్లడిన మాటలు, ట్రంప్ ఇచ్చిన హామీలు, భారత్, అమెరికాల మధ్య ఆర్ధిక కార్యకలాపాల్లో పురోగతిని సాధించడానికి ఎంతగానో ఉపయోగపడింది.. సభలో పాల్గొన్న ఎన్నారైలకు అభివాదం చేసిన మోదీ, భవిష్యత్ కార్యలకలాపాలపై చర్చించారు.. ఇక హౌదీ-మోదీ సభ ముగిసిన తరువాత ట్రంప్, మోదీ చేతులు పట్టుకుని రావడంతో వారిద్దరి మధ్య ఉన్న స్నేహం అందరికి తెలిసిందని అన్నారు..ఇక మోదీ సర్కార్ ట్రంప్ కు ఘన స్వాగతం పలికేందుకు సిద్దంగా ఉన్నారని తెలుస్తోంది.. హౌదీ-మోదీ సభకు దాదాపుగా 50 వేల మంది వచ్చారు.. అయితే ట్రంప్ కు 40 వేల నుంచి 50 వేల మంది వస్తే నచ్చదని దాదాపు 40 లక్షల నుంచి 50 లక్షల మంది రావాలని మోదీ సరదాగా అన్నారు..

ఇక ప్రపంచంలోనే అత్యంత పెద్ద క్రికెట్ స్టేడియంలో తమ సభ జరగబోతుందని ట్రంప్ తెలిపారు..అహ్మదాబాద్ క్రికెట్ స్టేడియం నిర్మాణం దాదాపు పూర్తయిందని అక్కడే సభ నిర్వహించనున్నారని తెలిపారు.. అయితే ప్రజలు అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి స్టేడియం వరకు మానవ హారంలా స్వాగతం పలుకుతారని సరదాగా వ్యాఖ్యానించారు..అహ్మాదాబాద్ స్టేడియం ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం అని తెలిపారు.. వ్యూహాత్మక సంబంధాలు, ప్రజల్లో స్నేహ సంబంధాలు బలోపేతం కానున్నట్లు రెండు ప్రభుత్వాలు ప్రకటించాయి..ఇక ట్రంప్ నేరుగా ఆయన భార్యతో కలిసి అహ్మదాబాద్ లో ల్యాండ్ కానున్నారు..అక్కడ భారత ప్రధాని మోదీ ట్రంప్ దంపతులకు ఘన స్వాగతం పలకనున్నారు..ట్రంప్ దంపతులు అహ్మాదాబాద్ కు చేరుకున్న తరువాత మోదీ వారిని నేరుగా సబర్మతి ఆశ్రమానికి తీసుకువెళ్ళనున్నారు..
ఆ తరువాత హృదయ్ కంజ్, గాంధీజి ఇల్లు, నూలు వడికే రాట్నం ప్రాంతాలకు తీసుకెళ్ళి వాటి ప్రాముఖ్యతను వివరించనున్నట్లు తెలుస్తోంది.. రోజు మొత్తం మోదీ ట్రంప్ దంపతులతోనే ఉండి పరిసర ప్రాంతాల్లో పర్యటించే అవకాశం ఉంది.. ఇక గుజరాత్ లో కట్టిన స్టాట్యూ ఆఫ్ యూనిటీ దగ్గర కూడా పర్యటించే అవకాశం ఉంది..భారతీయ సాంస్కృతి సాంప్రదాయాలను మోదీ ట్రంప్ కు వివరిస్తారు.. అనంతరం సాయంత్రం అహ్మాదాబాద్ స్టేడియంలో జరిగే సభకు హాజరుకానున్నారు..ఈ సభలో ముందుగా సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రారంభిస్తారు..ఆ కార్యక్రమాలు భారతీయతను చాటిచెప్పేల ఉంటుందని తెలుస్తోంది.. ఆ తరువాత ఇరువురు నేతలు సభలో ప్రసంగాలు చేసి ఇరు దేశాల మధ్య ఉన్న దౌత్య సత్సంబంధాల గురించి, భవిష్యత్ లో ఇరు దేశాల మధ్య జరగబోయే వాణిజ్య సంబంధాల గురించి ప్రస్తావించనున్నారు..
ఇప్పటికే మోదీ ట్రంప్ పలుసార్లు భేటీ అయ్యారు.ఫ్రెంచ్ టౌన్ బియారిట్జ్ లో నిర్వహించిన జీ-7 సమ్మిట్ లోను భేటీ అయ్యారు..అయితే మళ్ళీ తాజాగా ట్రంప్ భారత్ పర్యటన ఆర్ధిక, వాణిజ్య ఒప్పందాలు జరగనున్నట్లు తెలుస్తోంది..ట్రంప్ భారత్ పర్యటన అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్నది అని యూఎస్-ఇండియా స్ట్రాటజిక్ అండ్ పార్టనర్ షిప్ ఫోరమ్ ప్రెసిడెంట్ ముఖేష్ అఘి పేర్కొన్నారు..అమెరికా అభివృద్ధిలో భారత్ కూడా భాగస్వామి అని ట్రంప్ గుర్తించారని ఆయన తెలిపారు..

ఈ పర్యటనలో భాగంగా భారత్ లో రక్షణ వ్యవస్థను పెంపొందించడానికి పలు ఒప్పందాలు చేసుకోనుంది.. ప్రపంచంలోనే అత్యాధునిక సైనిక హెలికాఫ్టర్ల కోసం రూ.18531 కోట్ల విలువైన ఒప్పందానికి భారత్ సిద్ధమైనట్లు తెలుస్తోంది.. అమెరికా దేశానికి చెందిన రక్షణ సంస్థ లాక్ హీడ్ మార్టీన్ తో ఈ ఒప్పందం చేసుకోనున్నట్లు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం వస్తోంది. ట్రంప్ పర్యటన ద్వారా అమెరికా దేశంతో వ్యూహాత్మక ఒప్పందాలకు మార్గం సుగమం చేసుకుని బలోపేతం చేసుకోవడానికి మోదీ సర్కార్ అడుగులు వేస్తోంది..2007 నుంచి ఇప్పటి వరకు భారత్ అమెరికాతో రూ.1,21,128 కోట్ల విలువ చేసే వాణిజ్యం జరిపింది..ఇక ఈ ఒప్పందంలో భాగంగా 24 అత్యాధునికి MH-60R సీహాక్ హెలికాఫ్టర్లను అమెరికా నుంచి భారత్ కొనుగోలు చేయనుంది..

తాజాగా భారత్ ను అభివృద్ది చెందుతున్న దేశంగా పరిగణించరాదని, భారత ఆర్ధిక వ్యవస్థను డెవలప్డ్ ఎకానమీగా పరిగణించాలని USTR ( అమెరికన్ ట్రేడ్ రిప్రజెంటీవ్స్ కార్యలయం ) స్పష్టం చేసింది..దీంతో ఇప్పటి వరకు అమెరికా జనరలైజ్డ్ సిస్టం ఆఫ్ ప్రిఫరెన్సు పథకం భారత్ కు వర్తించదని క్లారిటీ ఇచ్చింది..అయితే దీంతో ఎటువంటి సుంకాలు లేకుండా ఎగుమతి చేసే ఎగుమతి దారులకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇతర దేశాలు అందించే జీఎస్పీ వంటి అభివృద్ధి రాయితీలు అవసరం లేదని , భారత్ స్వతంత్రంగానే వాణిజ్యంలో ధీటుగా ఎదుగుతుందని పీయూష్ గోయల్ తెలిపారు..జీఎస్పీ ప్రయోజనాలకు గండిపడితే ఎగుమతి దారులపై ఒత్తిడి పెరుగుతుందని , మార్కెట్ వాటా తగ్గుతుందని ట్రేడర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు..ఇటువంటి అంశాలపై సైతం చర్చించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి..
దేశ తలసరి ఆదాయం, ప్రపంచ వాణిజ్యంలో దేశ వాటా ఆధారంగా ఆ దేశ ఎకానమీని మదింపు చేస్తారు. ఇక ప్రపంచ వాణిజ్యంలో 0.5 శాతం ఉన్న దేశాలను అభివృద్ధి చెందుతున్న దేశాలుగా పరిగణిస్తారు. భారత్‌ ఈ పరిమితిని ఎప్పుడో అధిగమించింది. 2017 నాటికే భారత్‌ ప్రపంచ వాణిజ్యంలో ఎగుమతుల్లో 2.1 శాతం, దిగుమతుల్లో 2.6 శాతం సమకూరుస్తోంది. దీంతో పాటు అర్జెంటీనా, బ్రెజిల్‌, ఇండోనేషియా, దక్షిణాఫ్రికా వంటి దేశాల సరసన జీ 20లో భారత్‌ కొనసాగుతుండటంతో భారత్‌ను అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగానే పరిగణించాలని యూఎస్‌టీఆర్‌ స్పష్టం చేసింది. ఇక ఉభయ దేశాల మధ్య మరికొన్ని దౌత్య పరమైన ఒప్పందాలు చేసుకోనున్నారని తెలుస్తోంది.. అంతేకాదు అగ్రదేశాల మధ్య నెలకొనే ఈ ఒప్పందాలు ప్రపంచ ఆర్ధిక వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశం ఉంది.మరోవైపు త్వరల్లో రానున్న అమెరికా ఎన్నికల్లో ప్రవాస భారతీయుల పాత్ర ఎక్కువగా ఉంటుందని , వారు ఎన్నికల్లో ప్రభావం చూపుతారని ఈ పర్యటన ఎన్నికల్లో కూడా అనుకూలంగా మారే అవకాశం అని అంటున్నారు..