ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో కోర్టు ప్రాంగణం బాంబు పేలుడుతో ఉలిక్కిపడింది. బాంబు పేలుడు కారణంగా ముగ్గురు న్యాయవాదులు గాయపడ్డారు. పోలీసులు అక్కడికి చేరుకుని ముందు జాగ్రత్తగా అక్కడ తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో మరో మూడు నాటు బాంబులు వారికి దొరికాయి. ఇద్దరు న్యాయవాదుల మధ్య గొడవల కారణంగా ఈ బాంబు పేలుళ్లు జరిగినట్లు తెలుస్తోంది. న్యాయవాది సంజీవ్ లోధీని లక్ష్యంగా చేసుకుని ఈ పేలుళ్లకు పాల్పడ్డారు. బాంబు పేలుళ్లకు కొద్ది సేపటిముందే లోధీపై దాడి కూడా చేశారు. జితు యాదవ్ అనే న్యాయవాది తనను లక్ష్యం చేసుకుని ఈ దాడి చేశాడని సంజీవ్ లోధీ ఆరోపించారు.