హస్తినను హస్తగతం చేసుకున్న ఆప్.. ఢిల్లీలో క్రేజ్ తగ్గని క్రేజీవాల్..ఖాతా తెరవని కాంగ్రెస్.. భారీగా ఓట్ షేర్ పెంచుకున్న బీజేపి.. వర్కౌట్ అయిన ప్రశాంత్ కిశోర్ ప్రచార అస్త్రం..ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ… నువ్వా నేనా అంటూ హోరా హోరీగా జరిగిన ఢిల్లీ ఎన్నికల ఫలితాలు విడుదల అయ్యాయి.. అందరు అనుకున్నట్లుగానే ఢిల్లీ పీఠం కేజ్రీ చేతికే దక్కింది..ఎన్నికలు అయిన తరువాత అన్నీ ఎగ్జిట్ పోల్స్ ఆమ్ ఆద్మీ పార్టీకే అధికారం వస్తుందని చెప్పాయి.. అన్నట్లే అంకెల్లో తేడా ఉన్నప్పటికీ గెలుపులో మాత్రం ఎటువంటి మార్పు లేదు..

దేశ రాజధాని ఢిల్లీలో ఫిబ్రవరి 8 వ తేదిన 70 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి..ఢిల్లీలో మొత్తం 57.06 శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల సంఘం ప్రకటించింది.. ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు 672 మంది అభ్యర్థులు పోటీ చేశారు.. న్యూఢిల్లీ సీటు కోసం అత్యధికంగా 26 మంది అభ్యర్థులు పోటీ పడగా , పటేల్ నగర్ సీటు కోసం అత్యల్పంగా నలుగురు మాత్రమే పోటీ చేశారు.. ఎన్నికల్లో ప్రధానంగా ఆమ్ ఆద్మీ పార్టీ, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్, జనతాదల్, కమ్యూనిస్ట్ పార్టీలు పోటీ పడ్డాయి.. అయితే బీజేపీ , ఆమ్ ఆద్మీ పార్టీలు మాత్రం నువ్వా నేనా అంటూ తలబడ్డాయి..అయితే ఎన్నికల సమయంలో జోరు చూపించిన ఇతర పార్టీలు ఫలితాల్లో మాత్రం తేలిపోయాయి.. మొత్తం 70 స్థానాలకు గాను 58 స్థానాలను జనరల్ అభ్యర్థులకు, 12 స్థానాలను రిజర్వుడ్ కేటగిరి అభ్యర్థులకు కేటాయించారు..

ఢిల్లీ పీఠం పొందాలంటే ఏ పార్టీకైనా 36 సీట్ల మెజారిటీ కావాలి…ఎన్నికల సమయంలో మంచి జోరు కనబరిచిన ఆప్ ఫలితాల్లోను అదే జోరు చూపించింది..ప్రజల తీర్పు పూర్తిగా అర్వింద్ కేజ్రీవాల్ వైపే మొగ్గు చూపడంతో ముచ్చటగా మూడో సారి అర్వింద్ కేజ్రీ వాల్ ఢిల్లీ సీఎంగా ఎన్నికయ్యారు.. ఫిబ్రవరి 11 వతేదిన ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది.. ఫ్రారంభం నుండే ఆమ్ ఆద్మీ పార్టీ తన సత్తా చాటుతూ వచ్చింది.. కౌంటింగ్ ప్రక్రియలో ఏ దశలోను వేరే పార్టీ పుంజుకునే అవకాశం ఇవ్వలేదు.. గతంలో ఢిల్లీ శాసన సభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అఖండ విజయాన్ని నమోదు చేసింది.. గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ మొత్తం 70 స్థానాలకు 67 సీట్లను గెలుచుకుని కనీసం ప్రతిపక్షాన్ని కూడా లేకుండా చేశారు.. మొత్తం ఓట్ షేర్ లో 54.3 శాతం ఓటు షేర్ సాధించి రికార్డు సృష్టించిన ఆప్ పార్టీ, ఈ సారి కూడా తన అధికారాన్ని నిలబెట్టుకుంది.. కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతున్నప్పుడు ప్రతీ దశలోను చీపురు పార్టీ తమ ఆధిక్యతను ప్రదర్శించింది.. కౌంటింగ్ ప్రక్రియ ఉదయం 8 గంటలకు ప్రారంభమైనప్పటి నుండి ఆప్ హవానే కొనసాగింది.. మొదట బ్యాలెట్ ఓట్ల లెక్కింపు సమయంలో సైతం ఆమ్ ఆద్మీ పార్టీనే ఆధిక్యత ప్రదర్శించి.. ఆ తరువాత మొదలైన ఈవియంల్లో నిక్షిప్తిమైన ఓట్ల లెక్కింపు విషయంలోను చీపురు పార్టీ పూర్తి ఆధిక్యత ప్రదర్శించింది.. అంతేకాదు మొత్తం 70 స్థానాల్లో మొదటి నుండే 50 స్థానాలకు పైగా లీడింగ్ లో ట్రెండ్ అయ్యింది..

ఎన్నికల్లో ఖచ్చితంగా అధికారం తమదే అని జోరు చూపించిన బీజేపీకి కూడా అధికారాన్ని చేజిక్కించుకునే అవకాశం రాలేదు.. కానీ గతంలో పోలిస్తే బీజేపీ మాత్రం తమ ఓట్ షేర్ ను పెంచుకుంది..గతంలో 32.3 శాతం ఓటు షేర్ సాధించిన కమలం పార్టీ ఈ సారి తమ ఓట్ షేర్ ను భారీగా పెంచుకుంది..అంతేకాదు గతంలో కేవలం మూడు స్థానాలకే పరిమితం అయిన బీజేపీ ఈ సారి తన స్థానాలకు పెంచుకుని తమ బలాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేసింది.. ఎన్నికల్లో హోరా హోరీగా పోటీ పడిన మరో జాతీయ పార్టీ కాంగ్రెస్ తన పేలవ రికార్డును సాధించింది.. గతంలో ఉన్న ఓట్ షేర్ ను కూడా సాధించలేక చతికిలబడింది.. 2010లో 24 శాతం ఉన్న కాంగ్రెస్ ఓట్ షేర్ 2015 లో 10 శాతం కు పడిపోయింది.. అయితే ఈ సారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఎవరు పట్టించుకోలేదని స్పష్టం అయ్యింది.. హస్తం పార్టీకి ఈ ఎన్నికల్లో తన ఉనికిని చాటుకోలేకపోయింది.. కౌంటింగ్ స్టార్ట్ అయినప్పటి నుండి భారతీయ జనతా పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య పోటీ కొనసాగింది కానీ మిగిలిన పార్టీలు కనీసం ఉనికి సైతం చాటుకోలేకపోయాయి.. అయితే ప్రజల నిర్ణయం మాత్రం ఆప్ వైపే ఏకపక్షంగా కొనసాగిందని తెలుస్తోంది..అంతే కాకుండా ఆమ్ ఆద్మీ పార్టీ నిరంతరం సామాన్య ప్రజలతో కొనసాగడమే ఈ విజయానికి కారణం అంటున్నారు..

ఢిల్లీ ప్రజలు పార్లమెంట్ ఎన్నికల తీర్పుకు పూర్తి వ్యతిరేకంగా అసెంబ్లీ ఎన్నికల్లో తీర్పునిచ్చారు. ప్రజల శ్రేయస్సే ముఖ్య లక్ష్యంగా పని చేయడం వల్లే ఈ విజయం సాధించామని ఆమ్ ఆద్మీ నేతలు పేర్కొన్నారు..అంతేకాదు ప్రచారాల్లో ప్రశాంత్ కిశోర్ స్ట్రాటజీ కూడా బాగా పనిచేసిందనే చర్చలు కూడా జరుగుతున్నాయి.. మొత్తానికి ఆప్ కు అన్ని అంశాలు కలిసొచ్చి ముచ్చటగా మూడో సారి అధికారాన్ని చేజిక్కించుకుంది..

ఆమ్ ఆద్మీ పార్టీ 2015 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 67 సీట్లను కైవసం చేసుకుని రికార్డును క్రియేట్ చేసింది.. మిగిలిన 3 సీట్లను కాషాయం పార్టీ తన ఖాతాలో వేసుకుంది.. అయితే ఈసారి అతి స్వల్ప తేడాతో ఆమ్ ఆద్మీ పార్టీ 63 సీట్లను గెలుచుకోగా మిగిలిన 7 సీట్లను భారతీయ జనతా పార్టీ గెలుచుకుంది..అయితే మిగిలిన పార్టీలు మాత్రం ఈ ఎన్నికల ఫలితాలతో ఖంగుతిన్నాయి. కనీసం డిపాజిట్లు కూడా రాకపోవడంతో పరువును సైతం నిలబెట్టుకోలేకపోయాయి..

ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం అయిన మొదటి రౌండు నుండి బీజేపీ 23 స్థానాల్లో, ఆప్ 47 స్థానాల్లో ఆధిక్యత ప్రదర్శించాయి… కాంగ్రెస్ మాత్రం ఏ దశలోను పుంజుకోలేకపోయారు.. అంతేకాకుండా ఒక 10 నుంచి 15 స్థానాల వరకు లాస్ట్ రౌండ్ వరకు విజయం కాస్త దోబూచులాడింది… చివరకు 63 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచి, 7 స్థానాలను బీజేపీకి ఇచ్చారు..

ఢిల్లీ లో ఆమ్ ఆద్మీ పార్టీ కార్యలయం వద్ద భారీ సంఖ్యలో ప్రజలు గుమికూడి సభ నిర్వహించారు.. ఈ సభలో కేజ్రీవాల్ ఢిల్లీ ప్రజలారా ఐ లవ్ యూ అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు..అలాగే ఈ విజయం రాజకీయ వ్యవస్థకు సరికొత్త రూపమని ఆయన అన్నారు.. ఇది తన విజయం కాదని ఢిల్లీ ప్రజలు సాధించిన విజయం అని ఆయన అన్నారు.. నిజమైన దేశభక్తికి తమ గెలుపే నిదర్శనమని చెప్పుకొచ్చారు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు. రాజకీయాల్లో పని చేసేందుకు అవకాశం వస్తే, నేతలు ప్రజల కోసం పని చేయాలని, విద్యా వ్యవస్థ, ఆసుపత్రుల మీద దృష్టి పెట్టి మెరుగైన సౌకర్యాలు అందించాలని తెలిపారు.. అలా పని చేసిన వారికే ప్రజల మద్దతు ఉంటుందని మనీశ్ సిసోడియా తెలిపారు.

ఎన్నికల సమయంలో ఢిల్లీలో ఆమ్‌ ఆద్మీ పార్టీ నేతలు విద్య, ఆసుపత్రుల సౌకర్యాలపై మాట్లాడారని, ఇతర పార్టీల నేతలు మాత్రం రెండు మతాల గురించి మాట్లాడారని బీజేపీని ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్‌ రెండు పార్టీల ప్రముఖులు పలువురు ఓటమి చెందారు. ముఖ్యంగా ఎన్నికల ముందు ఆప్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరిన ఆల్కాలంబాను చాందినీచౌక్‌ ఓటర్లు కంగుతినిపించారు. మంగోలిపురం నుంచి పోటీ చేసిన కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రాజేష్‌ లిలోథియా, పటేల్‌ నగర్‌ నుంచి పోటీ చేసిన కృష్ణతీర్థ, సంగం విహార్‌ నుంచి పోటీ చేసిన పూనం అజాద్‌ ఓటమి చవిచూశారు. అలాగే బీజేపీకి చెందిన విజేందర్‌ గుప్తా రోహిణిలో, రాజీవ్‌బబ్బర్‌ తిలక్‌నగర్‌లో, తాజిందర్‌సింగ్‌ బగ్గా హరినగర్‌లో గెలుపు వరించలేదు.. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలను ఢిల్లీ ప్రజల్లోకి తీసుకెళ్లడంలో తమ కార్యకర్తలు సమర్థవంతంగా పని చేస్తే తమ పార్టీ మంచి ఫలితాలను రాబడుతుందని, కానీ, అలా జరగని పక్షంలో కేజ్రీవాల్ పథకానికి ప్రాముఖ్యత లభిస్తుందని, అదే ఇప్పుడు జరిగిందని చెప్పారు.

దేశ రాజధాని అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ తమ బలం తగ్గింది.. అంతేకాదు గతంలో ప్రతిపక్షం కూడా లేకుండా చేసిన ఆప్ కు ఈ సారి కొంత మాత్రం కొన్ని చోట్ల భంగపాటు తప్పలేదు.. అయితే విజయంపై ఎన్నో ఆశలతో పోటీ చేసిన బీజేపీకి ఢిల్లీ సీఎం పీఠం దక్కన్నప్పటికీ గత బలాన్ని పెంచుకోవడంలో సఫలం అయ్యిందని చెప్పుకోవచ్చు.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా మూడో సారి ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించినప్పటికీ ఓటింగ్ ను కోల్పోయింది. గెలుపు ఆశలు పెట్టుకుని చతికిలపడిన బీజేపీ గతంతో పోల్చుకుంటే తన బలాన్ని గణనీయంగా పెంచుకుని సంతోషపడుతోంది. 2015 ఎన్నికల్లో కేవలం మూడు స్థానాలతో సరిపెట్టుకున్న భారతీయ జనతా పార్టీ ఈసారి తన బలాన్ని పెంచుకుంది.. మరోవైపు గత ఎన్నికల్లో 67 స్థానాలు సాధించి అప్రతిహత మెజార్టీ సొంతం చేసుకున్న ఆప్‌ ఈసారి 50 పైగా స్థానాలకే పరిమితమవ్వడంతో బలం కొంత మేర తగ్గిందని అర్ధం అవుతోంది..

ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ విజయం ఖరారు కావడంతో కేజ్రీవాల్ ఇంటికి విజయరథం చేరుకుంది. ఢిల్లీ వ్యాప్తంగా ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటుండగా, ఈ వారం చివరిలోగా, మూడవసారి ఢిల్లీ పీఠంపై కేజ్రీవాల్ సీఎంగా కూర్చుంటారని ఆప్ వర్గాలు అంటున్నాయి. మరోవైపు ఏపి ఎన్నికల్లో వైసీపీ విజయంలో కీలకపాత్ర పోషించిన ప్రశాంత్ కిశోర్ ఆప్ కు సైతం పనిచేశారు.. దాంతో ఆయన ప్రచార వ్యూహాలు కూడా కేజ్రీవాల్ విజయానికి దోహదపడ్డాయని తెలుస్తోంది.. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ గెలుపు ఖరారు అయిన తరువాత ప్రశాంత్ కిశోర్ ఢిల్లీ ప్రజలకు ట్విట్టర్ ద్వారా ధన్యవాదాలు తెలియజేశారు. జగన్ ను సీఎం కుర్చీ ఎక్కించిన ప్రశాంత్ కిశోర్ వ్యూహాలు కేజ్రీవాల్ కూ పనిచేశాయని చెప్పుకొస్తున్నారు..

ఇక ప్రముఖ జాతీయ పార్టీ కాంగ్రెస్ కనీసం ఒక్క సీటులో కూడా విజయం సాధించలేదు. అంతేకాదు ఢిల్లీలో కాంగ్రెస్ నేతల పరిస్థితి దారుణంగా తయారైంది..పోటీ చేయకపోయిన బాగుండేదని కాంగ్రెస్ నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.. అంతేకాకుండా కాంగ్రెస్ ఓట్ షేర్ గణనీయంగా తగ్గింది..హస్తం పార్టీ పరిస్థితి దయనీయంగా తయారైందని ఆ పార్టీకి వచ్చిన ఓట్లను బట్టి అర్థం అవుతోంది… ఇక మిగిలిన పార్టీలన్ని ఓటింగ్ లో పెద్ద లెక్కింపులోకి రాలేదు..జనతా దళ్, బిఎస్పీ వంటి పార్టీలకు డిపాజిట్లు కూడా దక్కలేదు.. కొన్ని పార్టీలకు నోటాకు పడినన్ని ఓట్లు కూడా రాలేదు. కాబట్టి ఢిల్లీ ప్రజల తీర్పు ఏక పక్షంగా సాగిందని, అందరు కేజ్రీవాల్ వైపే మొగ్గు చూపారని తెలిసింది.. ఇక ఇతర పార్టీలు మాత్రం సాధ్యం కానీ హామీలు ఇవ్వడం వల్లే కేజ్రీవాల్ కు అధికారం వచ్చిందని విమర్శలు చేస్తున్నారు.. మొత్తానికి హ్యాట్రిక్ గా విజయం సాధించిన కేజ్రీవాల్ ఈ వారంలోనే ప్రమాణ స్వీకారం చేయనున్నారు.. అంతేకాదు ప్రజలకు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టడానికి నిరంతరం కృషి చేస్తానని ఆయన తెలిపారు.. అత్యధిక మెజార్టీతో విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ శ్రేణులు ఆనందోత్సహాలలో మునిగితేలుతున్నారు.. అంతేకాకుండా ఢిల్లీలో పెరిగిపోతున్న కాలుష్యం దృష్ట్యా ఎవరు టపాసులు పేల్చకుండా మిఠాయిలు పంచుతూ సంబరాలు జరుపుకోవాలని ఆప్ కార్యకర్తలకు ఆ పార్టీ నేతలు తెలియజేశారు..