సబ్సిడీయేతర వంట గ్యాస్ సిలిండర్ భారీగా పెరిగింది. ప్రభుత్వ రంగంలోని చమురు మార్కెటింగ్ కంపెనీలు ఓ ప్రకటన చేశాయి. పెరిగిన ధరలు ఈ రోజు నుంచే అమల్లోకి రానున్నాయని కంపెనీలు తెలిపాయి. ఈ పెంపు వల్ల ఢిల్లీలో 14.2 కిలోల సిలిండర్ ధర రూ.858.50 చేరింది. ఈ పెంపు కొన్ని ప్రాంతాలలో 149 రూపాయల వరకు ఉండబోతోంది. సబ్సిడీ కింద వినియోగదారులకు ఇచ్చే మొత్తం రూ.153.86 నుంచి 291.48కు పెంచారు. 2019 ఆగస్టు నుంచి సిలిండర్ ధరను కంపెనీలు ప్రతీ నెలా పెంచుతూ వెళుతున్నాయి.