ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఫిబ్రవరి 12న ఢిల్లీకి బయలుదేరనున్నారు. జగన్ తన ఢిల్లీ పర్యటనలో భాగంగా తొలుత ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీ ముగిశాక సీఎం జగన్ ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 12 సాయంత్రం ప్రధాని మోదీతో సమావేశం అయిన తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కూడా కలిసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో పాలన వికేంద్రీకరణ, మండలి రద్దు వంటి అంశాలు వీరు చర్చించనున్నారు.