తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ కలిశారు. హైదరాబాద్‌లోని పాతబస్తీ లాల్‌దర్వాజ మహంకాళీ సింహవాహిని అమ్మవారి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని అక్బరుద్దీన్ కోరారు. వీరి భేటీపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అక్బరుద్దీన్ ఒవైసీ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుని కలిసి, మన లాల్‌దర్వాజ మహంకాళీ అమ్మవారి ఆలయం గురించి మాట్లాడాడమే అదే విధంగా కొన్ని మసీదుల గురించి మాట్లాడాడు. వెంటనే ముఖ్యమంత్రి గారు నిధులు కూడా విడుదల చేశారు. దీని వెనుక కుట్ర ఏంటో తెలుసా అని ప్రశ్నించారు అక్బరుద్దీన్. అక్బరుద్దీన్‌ పై ఒక మచ్చ ఉంది.. హిందువులకి వ్యతిరేకంగా ఆయన మాట్లాడాడని.. గోమాంసం గురించి పలు వ్యాఖ్యలు చేశాడన్నారు రాజాసింగ్. అంతేకాకుండా హిందూ ధర్మంపైన కూడా అప్పట్లో మాట్లాడాడు.. ఇప్పుడు టీఆర్‌ఎస్, ఎంఐఎం కలిశాయి.. ఇదంతా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్లాన్ అని రాజా సింగ్ వ్యాఖ్యలు చేశారు.

Image result for raja singh

అక్బరుద్దీన్‌ను లెటర్ ఇవ్వమని చెప్పారని.. ఆ తర్వాత వెంటనే ఫండ్ విడుదల చేస్తానని చెప్పారని.. దీంతో హిందువులు ఒవైసీకి సానుకూలంగా మారతారని కేసీఆర్ ప్లాన్ వేశారని రాజాసింగ్ చెప్పుకొచ్చారు. నేను ముఖ్యమంత్రిని ఓ రిక్వెస్టు చేస్తున్నా.. మీరు మరోసారి అక్బరుద్దీన్‌ను పిలవండి. హిందువుల గురించి ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల క్షమాపణలు కోరమని చెప్పండని రాజాసింగ్ అన్నారు. ఇలా చెబితే అక్బరుద్దీన్‌ ఒవైసీ మారిపోయిండని ప్రజలు అప్పుడు నమ్ముతారు. మీరేం పనులు చేస్తున్నారో.. ప్రజలకు అన్నీ తెలుసునని రాజాసింగ్ చెప్పారు. అక్బరుద్దీన్‌పై దేశ ద్రోహం కేసులు ఉన్న విషయాన్ని రాజా సింగ్ గుర్తు చేశారు. పాతబస్తీలోని కాళిమత ఆలయాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలో తమకు తెలుసని రాజాసింగ్ వ్యాఖ్యానించారు. ఎంఐఎం నాయకులకు మాత్రం అడగకుండానే కేసీఆర్ అపాయింట్‌మెంట్‌ ఇస్తున్నారని.. తమ నియోజకవర్గ సమస్యలు చెబుదామంటే మాత్రం అసలు సమయం ఇవ్వడం లేదని అన్నారు రాజా సింగ్.