సచిన్ టెండూల్కర్.. ఎప్పుడు కోచ్ గా మారారు అని ప్రతి ఒక్కరికీ డౌట్ ఉండే ఉంటుంది. అది కూడా ఐపీఎల్ టీమ్ కు కోచ్ గా మారినా ఏదో అనుకోవచ్చు. కానీ పాంటింగ్ టీమ్ కు కోచ్ గా ఎందుకు బాధ్యతలు చేపట్టబోతున్నాడోనని అనుకుంటున్నారా..? మీ డౌట్ ని క్లారిఫై చేస్తాం.. వెయిట్ అండ్ సీ..!

ఇటీవల ఆస్ట్రేలియాను కార్చిచ్చు కబళించివేసిన సంగతి తెలిసిందే. ఎన్నో కోట్ల వృక్షాలు అగ్నికి ఆహుతయ్యాయి.. అలాగే లక్షల జంతువులు చనిపోయాయి. అలాగే అటవీ ప్రాంతానికి దగ్గర ఉన్న వాళ్ళు సర్వం కోల్పోయారు. వారికి ఎలాగైనా సాయం చేయాలని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ముందుకు వచ్చింది. అందుకే పాంటింగ్ లెవెన్- షేన్ వార్న్ లెవెన్ అంటూ రెండు జట్లూ ఓ ఛారిటీ మ్యాచ్ ఆడబోతున్నాయి. ఈ మ్యాచ్ ద్వారా వచ్చిన ఆదాయం నిరాశ్రయులైన వారికి అందించనున్నారు. సచిన్ కు ఆస్ట్రేలియాలో కూడా భారీగా అభిమానులు ఉన్నారు. ఆయన కూడా వస్తే చాలా బాగుంటుందని భావించిన ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు పాంటింగ్ జట్టుకు కోచ్ గా బాధ్యతలు తీసుకోవాలని కోరింది. అలాగే లెజెండరీ క్రికెటర్ కోర్ట్నీ వాల్ష్ షేన్ వార్న్ జట్టుకు కోచ్ గా వ్యవహరించనున్నాడు. ఈ మ్యాచ్ లో జస్టిన్ లాంగర్, ఆడమ్ గిల్ క్రిస్ట్, బ్రెట్ లీ, షేన్ వాట్సన్, అలెక్స్ బ్లాక్ వెల్, మైఖేల్ క్లార్క్ తమ సత్తా మైదానంలో మరోసారి చూపించనున్నారు. ఫిబ్రవరి 8 న ఈ మ్యాచ్ జరగనుంది.