కొందరు సెలెబ్రిటీలకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ ఉంటాయి. అవి చూడగానే చాలు అభిమానుల్లో కలవరం మొదలవుతూ ఉంటుంది. అలాంటివే తెలుగు కమెడియన్ అయిన సునీల్ కు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఫొటోల్లో సునీల్ ఆక్సిజన్ మాస్క్ ధరించి ఉన్నారు. అంతే ఏమి జరిగిందా.. ఏమి జరిగిందా అంటూ అందరూ కంగారు పడ్డారు.

సునీల్ హైదరాబాద్, గచ్చిబౌలిలోని ఏషియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీలో చేరారు. ఆయనకు వైద్యులు పలు వైద్య పరీక్షలు నిర్వహించి చికిత్స అందిస్తున్నారు. సునీల్, సునీల్ సన్నిహితులు ఆసుపత్రి పాలవ్వడంపై స్పందించారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని సునీల్ చెప్పినట్లు తెలుస్తోంది. సైనస్, ఇన్ఫెక్షన్ కారణంగానే ఆసుపత్రిలో చేరానని అన్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా చెప్పుకొచ్చారు.