అమరావతి: వచ్చే నెల నుంచి అన్ని రకాల పింఛన్లను లబ్ధిదారుల ఇంటివద్దకే తీసుకెళ్లి అందజేయాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. లబ్ధిదారులు ఇబ్బంది పడకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఉపాధిహామీ పనులు, గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, నాడు-నేడు కింద పాఠశాలల్లో ప్రహరీ గోడల నిర్మాణం, వాటర్‌గ్రిడ్‌ తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. సర్వేలతో ముడిపెట్టి ఇళ్లపట్టాలను నిరాకరించవద్దని.. క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి లబ్ధిదారులను గుర్తించాలని సీఎం ఆదేశించారు. అర్హులు ఎంతమంది ఉన్నా పట్టాలు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు.