హైదరాబాద్‌: మెర్సిడెస్‌ బెంజ్‌ సిల్వర్‌స్టార్‌, బిజినెస్‌ మింట్‌ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దేశవ్యాప్త హెల్త్‌కేర్‌ కన్‌క్లేవ్‌లో తమ తమ విభాగాల్లో పేరుపొందిన 30 మందికి పైగా అవార్డులు పొందారు.

విద్యుత్తు శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌మిశ్రా, డా.హరివీర్‌సింగ్‌ నెహ్వాల్‌ ముఖ్య అతిథులుగా హాజరై అవార్డులను ప్రదానం చేశారు. ఆడియాలజీ విభాగంలో ఈఎన్‌టీ వైద్యులు నాగేందర్‌ కాంకిపాటి, అంకాలజీ విభాగంలో డా.ఎస్‌.మల్లిక్‌, అవుట్‌ స్టాండింగ్‌ డెంటిస్ట్‌గా డా.అనూరాధ, ఫార్మా విభాగంలో లోర్వెన్‌ కంపెనీకి, ఉమెన్‌ హెల్త్‌ అండ్‌ హైజీన్‌ ఎడ్యుకేషన్‌ విభాగంలో డా.బి.విజయలక్ష్మీ, హోమియోపతిలో డా.సీ.హెచ్‌.ప్రవీణ్‌ కుమార్‌, హెల్త్‌కేర్‌ ఫర్‌ ఫ్రీ కమ్యూనిటీ విభాగంలో డీసీఎంఎస్‌ అల్యుమ్నీ అసోసియేషన్‌, ఫార్మా పంపిణీ రంగంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తగా ఎస్‌.సత్యనారాయణ తదితరులు అవార్డులు పొందిన వారిలో ఉన్నారు.