దిల్లీ: టీమిండియా ఓపెనర్‌ కేఎల్ రాహుల్‌ను భారత మాజీ ఆటగాడు గౌతం గంభీర్ పొగడ్తలతో ముంచెత్తాడు. రాహుల్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడని,  టెస్టుల్లో 50 బంతుల్లోనే శతకం సాధించే సత్తా అతడికి ఉందని గంభీర్‌ కొనియాడాడు. ‘‘కేఎల్‌ రాహుల్ అద్భుతఫామ్‌లో కొనసాగుతున్నాడు. అతడు టెస్టుల్లో కూడా అలా ఎందుకు ఆడట్లేదని నన్ను ఆశ్చర్యపరుస్తుంది. వైట్‌ బాల్‌ క్రికెట్‌లో మాత్రమే కాదు అతడు టెస్టుల్లో కూడా అదరగొట్టాలి. ఆటలో ఎంతో మెరుగయ్యాడు. సుదీర్ఘఫార్మాట్‌లో అతడు 50 బంతుల్లోనే 100 పరుగులు సాధించే సత్తా ఉన్న ఆటగాడు. అతడి షాట్లు ఎంతో చూడముచ్చటగా ఉన్నాయి’’ అని గంభీర్‌ అన్నాడు.