కాచిగూడ, న్యూస్‌టుడే: మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీలు మున్నూరు కాపులకు సముచిత ప్రాధాన్యం ఇవ్వాలని తెలంగాణ మున్నూరు కాపు మహాసభ కోరింది. మంగళవారం కాచిగూడలో తెలంగాణ మున్నూరు కాపు మహాసభ రాష్ట్ర కోశాధికారి బండి శ్రీనివాస్‌ సంస్మరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుతారి నర్సింహులు, కార్యదర్శులు కార్యదర్శులు మాణిక్‌ ప్రభు, ఆది నగేశ్‌, చామకూర ప్రదీప్‌, సీనియర్‌ సభ్యులు యాదగిరిరావు తదితరులు మాట్లాడారు.

రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేసే మున్నూరు కాపులకు రాజకీయ పార్టీలకు అతీతంగా మహాసభ సహాయ సహకారాలు అందజేస్తుందన్నారు. హన్మంతరావు, చెలిమల ప్రదీప్‌, శ్రీనివాస్‌, శంకర్‌, ఆనంద్‌, వినోద్‌ పాల్గొన్నారు.