జాంబాగ్‌, న్యూస్‌టుడే: దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల నుంచి ఛార్జీల పేరిట అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్న వ్యక్తిని ఆర్టీసీ అధికారులు మంగళవారం ఎంజీబీఎస్‌లో పట్టుకుని అఫ్జల్‌గంజ్‌ పోలీసులకు అప్పగించారు. ఎంజీబీఎస్‌ సహాయ మేనేజరు సుధ కథనం ప్రకారం..

ఎంజీబీఎస్‌ నుంచి బైలాడీలా, జగదల్‌పూర్‌ తదితర దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ఆర్టీసీ కండక్టరుగా పరిచయం చేసుకుని, బస్సు ఛార్జీల పేరిట డబ్బులు వసూలు చేస్తున్న వ్యక్తిని మంగళవారం అధికారులు పట్టుకున్నారు. గతంలోనూ అతను ఇదే తరహాలో డబ్బులు వసూలు చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని ఆర్టీసీ కిందిస్థాయి అధికారులు ఎల్బీరెడ్డి, ఎస్‌.ఏ.రాజు తెలిపారు. అఫ్జల్‌గంజ్‌ పోలీసులు సదరు వ్యక్తిని విచారిస్తున్నారు.