క్రిస్‌మస్‌ వేళల్లో ప్రజలు శాంటాక్లాజ్‌ కోసం చర్చిలకు లేఖలు రాస్తుంటారు. పండుగ శుభాకాంక్షలు చెబుతూ.. కోరికల చిట్టా విప్పుతూ కోకొల్లలుగా శాంటాక్లాజ్‌లకు లేఖలు పంపుతారు. అలా వచ్చిన లేఖలకు జవాబు రాయాలి. ఒక్కో లేఖకు సమాధానం రాసినందుకు 10 డాలర్ల వరకు ఆదాయం పొందవచ్చు. అమెరికా వంటి దేశాల్లో ఇలాంటి ఉద్యోగాలు ఎక్కువగా ఉన్నాయి.