గుంటూరు: రాజధాని అమరావతి కోసం రైతులు చేస్తున్న ఆందోళనలు తీవ్రమయ్యాయని గుంటూరు జిల్లా తెదేపా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు అన్నారు. అమరావతి కోసం రైతులు శాంతియుతంగా ఆందోళనలు చేస్తుంటే ఆ ప్రాంతంలో అప్రకటిత కర్ఫ్యూ విధించటం ఎందుకని ప్రశ్నించారు. గుంటూరు పార్టీ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు.